జయకేతనం న్యూస్ ఆగస్టు 17
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా ఈనెల 25న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇంద్ర పార్క్ లో సత్యాగ్రహ దీక్ష కు మద్దతుగా బీసీలు హైదరాబాద్ కి తరలిరావాలని కోరుతూ మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీ లు నిత్యం బీసీ జపం చేస్తూ బీసీలపై కపట ప్రేమ చూపుతూ రాజకీయ పార్టీలు పబ్బం గడుపుతున్నారని ఆయన అన్నారు రాజకీయ పార్టీలకు బీసీలపై ప్రేమ ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీలకు అవకాశం ఇస్తారో వేచి చూడాలని అన్నారు.బీసీలను ఓటు బ్యాంకు గానే చూస్తున్న రాజకీయ పార్టీలకు బీసీలే ఒక రాజకీయ శక్తిగా ఎదిగే సమయం ఆసన్నమైందని కాబట్టి ఆర్.కృష్ణయ్య నిత్యం బీసీల కోసం 50 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు ధర్నాలు రాస్తారోకో లు చేసి 70 సంవత్సరాల వయసులో కూడా బీసీల కోసం దీక్ష కు పూనుకున్నందుకు బీసీలంతా మద్దతుగా 25న ఊరుకో బండితో హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో జరిగే సత్యాగ్రహ దీక్షకు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిలకల మురళి యాదవ్, గంగాధర్, రాయంచు నరసింహ, నరేష్, సతీష్ ,వెంకట్ తదితరులు పాల్గొన్నారు









