వ్యవసాయ కళాశాల నిర్మాణానికి అనువైన భూములను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 17

హుజూర్ నగర్ నియోజకవర్గం లోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాల నిర్మాణానికి అనువైన పాలకీడు మండలం, గుండ్లపహాడ్ పరిధిలోని ప్రభుత్వ భూమిని, హుజూర్ నగర్ రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1041 ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులతో కలిసి రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ భూములు రోడ్డు కనెక్టివిటీ ఉందని,సాగు చేయుటకి భూములు అనువుగా ఉన్నాయని నాగార్జున సాగర్ ఎడుమకాల్వ ద్వారా సాగు నీరు సైతం అందుతుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులకు మంత్రి కి వివరించారు.ఈ కార్యక్రమం లో ప్రొఫెసర్ జయ శంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ జానయ్య, డీన్ ఝాన్సీ రాణి, డి ఎస్ ఎ వేణు గోపాల్ రెడ్డి,లింగయ్య,జిల్లా ఎస్పి కే నరసింహ,ఆర్డీఓ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, తహసీల్దార్లు కమలాకర్,నాగార్జున రెడ్డి, ఎ ఓ కళ్యాణ చక్రవర్తి,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్