ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి.జిల్లా ఎస్పీ కె. నరసింహ

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 17

తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్‌సైట్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు,ఊరేగింపులకు అనుమతి కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చునని
లింక్👇
https://policeportal.tspolice.gov.in/
సూర్యాపేట జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటు, నవరాత్రి ఉత్సవాల నిర్వహణ తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ https://policeportal.tspolice.gov.in/
నందు ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్పి నరసింహ తెలిపారు. ఆన్లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాలు ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుంది, నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుంది అన్నారు. మండపం నిర్వహణ, మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుంది, తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపినారు.

గణేష్ మండపాల నిర్వాహకులు పాటించవలసిన నియమనిబంధనలు.

1.గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే.

2.ప్రతీ మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

3.నిర్దేశించిన సమయనికి నిమర్జనం పూర్తి చేయాలి.

4.గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు,ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.

5.మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖలవారితో అనుమతులు తీసుకోవాలి

6.గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి

7.రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.

8.డి.జే లు ఏర్పాటు చేయరాదు.

9.గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.

10.గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన ను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి

11.గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి.

12.గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం,పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.

13.పోలీసు తనిఖీలకు సహకరించాలి, పాయింట్ బుక్ ఏర్పటు చేసుకోవాలి.

14.మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి పుకార్లు, వదంతులను నమ్మకూడదు అని ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్