


జయకేతనం న్యూస్ ఆగస్టు 18
హుజూర్ నగర్ పట్టణంలో మటన్ మార్కెట్ బజారు లో పట్టణ గౌడ సొసైటీ అధ్యక్షులు వల్లపుదాసు కృష్ణ గౌడ్ అధ్యక్షతన సర్దార్ పాపన్న జయంతి కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగింది ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఐ ఎన్ టి యు సి రాష్ట్ర జనరల్ సెక్రటరీ యరగని నాగన్న గౌడ్ హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లిఖర్జున్ రావు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతిని నిర్వహించి ఘన నివాళి అర్పించారు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయిలను గడగడలాడించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు హుజూర్ నగర్ పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ సైదా, కోలా మట్టయ్య, బంటు సైదులు,బత్తిని సత్యనారాయణ, కోడి ఉపేందర్, మేకపోతుల వీరబాబు, కుక్కడపు నరేష్,కారింగుల వెంకటేశ్వర్లు, బాలబోయిన సత్యనారాయణ, దొంతగాని సత్యనారాయణ, బత్తిని నాగరాజు, సైదులు గౌడ్, కోలా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు









