బాధిత కుటుంబాల బంధువులను పరామర్శించిన మల్లి బాబు యాదవ్, చిత్తారు సింహాద్రి యాదవ్

జయకేతనం న్యూస్ ఆగస్టు 25

కొణిజర్ల మండలం చిన్నగోపతి గ్రామానికి చెందిన ఖమ్మం జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి పగడాల మధు సోదరుని కుమారుడు పగడాల మనోజ్ కుమార్,కామేపల్లి మండలం తాళ్ల గూడెం గ్రామానికి చెందిన సిపిఐ పార్టీ జిల్లా నాయకులు జిల్లా యాదవ సంఘం నాయకులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు సతీమణి పుచ్చకాయల రమణమ్మ, ఖమ్మం నగరానికి చెందిన యాదవ సంఘం నాయకులు దాసరి నాగయ్య, ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. సోమవారం జరిగిన వారి దశదినకర్మ కార్యక్రమాలకు అఖిల భారత యాదవ మహాసభ నేతలు మేకల మల్లిబాబు యాదవ్, చిత్తారు సింహాద్రి యాదవ్ హాజరైనారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబాలను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తదనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన ముచ్చర్ల గ్రామానికి చెందిన సిరిపురం లలితమ్మ, కూతురు వివాహం జరిగి అప్పగింతలు అయ్యే సమయంలో గుండెపోటుతో మరణించిన అబ్బాస్ పురం గ్రామానికి చెందిన బానోతు కళ్యాణి, మరియు బారుగూడెం శ్రీ సిటీ వద్ద సోమవారం జరిగిన బొడ్డు లక్ష్మయ్య దశదినకర్మ కార్యక్రమాలలో కామేపల్లి మాజీ జెడ్పిటిసి డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో గూదే భద్రయ్య, డేగల ఉపేందర్, రామారావు, ఏపూరి లలితాదేవి వీరబాబు, మాదాల లింగయ్య సుశీల, బుచ్చయ్య నల్లపునేని వినోద రావు, ధరావత్ లాలు ధరావత్ రవి, కుమార్, తేజమరియు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్