జయకేతనం న్యూస్ ఆగస్టు 25
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం శ్రీనగర్ కాలనీ RCM చర్చ్ ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు డాక్టర్ మనోహర్ – డా. సుజాత దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ మనోహర్ 1990లో సుజాత మనోహర్ నర్సింగ్ హోమ్ స్థాపించి 35 సంవత్సరాల పాటు హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు సేవలందించి డాక్టర్ గా ఎన్నో క్రిటికల్ కేసులను ఛేదించి విశిష్ట సేవలు అందించి ప్రజల మన్నన లను పొందారని, వారి అసాధారణ వైద్య సేవ లకు ఆయన చేసిన కృషికి, వైద్య రంగం లో తాను చూపించిన ప్రతిభ మరియు సామాజిక సేవకు గుర్తింపుగా ఈ సన్మానం జరుగుతుంది. వారి సేవలకు కృతజ్ఞతగా ఈ వేడుకను అందరూ కలసి సన్మానించవలసినదిగా జాషువా సాహిత్య వేదిక కమిటీ సభ్యులు బయ్యారపు రవీంద్ర, మీసాల రాంబాబు కొల్లోజు నాగేంద్ర చారి, కొత్తపల్లి మధుసూదన్, భీమ పంగు వెంకటేశ్వర్లు, వేల్పుల మోష, కర్నే శ్రీను, తురక అంజయ్య తదితరులు తెలిపారు.









