జకాత్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గయాజుద్దీన్ బాబు ఖాన్ కన్ను మూత

 

జయకేతనం న్యూస్ ఆగస్టు 25

 

హైదరాబాద్ జకాత్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గయాజుద్దీన్ బాబు ఖాన్ సోమవారం కన్ను మూశారు.ఆయన 1990 నుండీ లక్షలాది మంది పేద విద్యార్థుల చదువు కోసం ఎనలేని సేవ చేశారు. మతం తో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేద విద్యార్థులకు చదువు కోసం ఆర్ధిక సహాయం చేశారు. ఆయన పేదల కోసం పడే తపన అలాంటిది. ఆయన ప్రతి మీటింగ్ లో ప్రతి పేద పిల్లవాడు చదువు కోవాలి, ప్రతి పేద పిల్లవాడు మంచి స్థానంలో ఉండాలి అనేవారు. కోట్లాది రూపాయలకు అధిపతి ఏసీ లలో ఉండవచ్చు కానీ అలాఉండకుండా పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం పరి తపించాడు.ఇదే కాకుండా వికారాబాద్ లో జూనియర్ కాలేజీ స్థాపించి అందులో 2012 నుండీ ఉచిత విద్య అందిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి. ప్రభుత్వం తరుపు నుండీ వస్తున్నా ప్రతి స్కీమ్ ప్రజలకు తెలియజేయటానికి తన సంస్థ ఎంప్లాయిస్ తో పని చేయించారు. ఇందులో ప్రభుత్వ స్కాలర్షిప్, షాదీముబారక్ గురుకుల పాఠశాలలు ముఖ్యమైనవి చెప్పవచ్చు. ఇంతగా ప్రజలకోసం పరితపించే వ్యక్తి మన మధ్య లేకుండా పోవడం బాధ కర విషయమే.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్