భర్త మరణ వార్త తట్టుకోలేక భార్య మృతి

 

భర్త మరణ వార్త తట్టుకోలేక భార్య మృతి

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 13

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు గెల్లి అప్పారావు మరణించిన విషాదం నుంచి వారి కుటుంబం ఇంకా కోలుకోకముందే భర్త మరణ వార్తను జీర్ణించుకోలేక ఆయన సతీమణి గెల్లి అరుణమ్మ (71) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సెప్టెంబర్ 10, 2025న గెల్లి అప్పారావు మరణించగా, సరిగ్గా మూడు రోజుల తర్వాత ఆయన భార్య కూడా మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ఈ వార్తతో హుజూర్ నగర్ లో ఆర్యవైశ్య కుటుంబాలతో పాటు,
హుజూర్ నగర్ మున్సిపల్ ప్రజల లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకరి తర్వాత ఒకరు మరణించడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. గెల్లి అరుణమ్మ పార్థివ దేహాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు, స్థానికులు నివాళులర్పించారు.
వారి అంత్యక్రియలు మధ్యాహ్నం 2.30 కు నిర్వహించనున్నారు.వాసవి క్లబ్- వాసవి వనిత క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ ఆధ్వర్యంలో డైమండ్ నేత్ర నిధికి గెల్లి అప్పారావు నేత్రాలను సెప్టెంబర్ 10న దానం చేసి శుక్రవారం అంత్యక్రియలు జరగగా,కుటుంబ కన్నీటి శోకం మరువక మునుపే తల్లి మరణించడంతో తీవ్ర దుఃఖం లో ఉండి ఆమె నేత్రాలను కూడా కుమారుడు గెల్లి రవి దానం చేయడంతో మరొకసారి తమ ఉదారతను చాటుకున్నాడు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్