రంగాపురం గ్రామ కార్యదర్శి పై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి
రంగాపురం గ్రామం లో బేతెస్థ మినిస్ట్రీస్ పేరును ఆన్ లైన్ లో చేయకుండా లంచం డిమాండ్ చేస్తూ,రాజకీయం చేస్తున్నా కార్యదర్శి పై కలెక్టర్ కు పిర్యాదు చేసిన బిషప్ దుర్గం ప్రభాకర్
బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 22
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కు గ్రీవెన్స్ డే లో రంగాపురం గ్రామం గరిడేపల్లి మండలం కార్యదర్శి పై పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ రంగాపురం గ్రామం, గరిడేపల్లి మండలం, జిల్లా సూర్యాపేట లోని ఇంటి నెం. 2-89/3 గల చర్చి ని గ్రామ పంచాయతి ఇంటిపన్ను రికార్డులలో అసెస్-మెంట్ నెం. 07 బేతెస్థ మినిష్ట్రిస్ గా పేరు మార్పు చేయుట గురించి కార్యదర్శి కీ లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకొని, ఎన్ని సార్లు అడిగిన చేయకుండా తీవ్ర ఇబ్బందులు గురించేస్తూన్నారని నువ్వు ఏమి చెయ్యలేవు నాకు రాజకీయ అండదండలు ఉన్నాయని బెదిరిస్తున్నాదని అన్నారు వివరాములకు వెలితే బిషప్, డా. దుర్గం ప్రభాకర్, బెతెస్థమినిష్ట్రిస్ సూర్యాపేట. నేను గత 5 సంవత్సరముల నుండి గరిడేపల్లి మండలం, రంగాపురం గ్రామంలో ఒక ఇంటిలో ప్రార్ధనలు నిర్వహిస్తునాను, అదే సమయంలో రంగాపురం గ్రామంలోని భీమిరెడ్డి లక్ష్మమ్మ, భర్త శ్రీను (లెట్) వారికి చెందిన ఇంటి నెం. 2-20 గల పాత ఇంటిని మరియు ఇంటి స్థలమును తేది: 28-11-2005న సెవెంత్ డే చర్చి వారు సిమెంట్ తో రెండు గదుల ఇంటిని కొనుగోలు చేసి,ఇంటి ముందు ఖాళీ స్థలములో చర్చి నిర్మించినారు. కాలక్రమేనా వారు అట్టి చర్చిని నిర్వహించలేక, మాకు అమ్ముటకు ఆ సంస్థ యొక్క ప్రెసిడెంట్ మరియు కమిటి సభ్యలు మమ్ములను పలుమార్లు సంప్రదించారు, ఇట్టి విషయం మా సంఘం సమక్షములో ప్రస్తుత చర్చి అసెస్-మెంట్ నెం. 2-89/3లోని Indian Financial Association of Seventh Day Advantest Annanagar, Chennai వారి వద్దనుండి తేది: 26-03-2025న నేను కొనుగోలు చేసినాము.ప్రస్తుతం ప్రార్ధనలు నిర్వహించుటకుగాను, కరెంట్ మీటర్ తీసుకొనుటకు గాను మరియు ఇట్టి ఇంటి నెంబర్ గ్రామ పంచాయతి అసెస్-మెంట్ రికార్డులలో బేతెస్థ మినిష్ట్రిస్, ఫాస్టర్ బిషప్, డా. దుర్గం ప్రభాకర్ గా మార్చు చేయగలరని తేది: 06-05-2025న గ్రామ పంచాయతి కార్యదర్శి శ్రీమతి లావణ్య కు ప్రత్యక్షంగా కలిసి లిఖితపూర్వక దరఖాస్తు ద్వారా కోరుతూ లింక్ డాక్యుమెంట్స్ మరియు కొనుగోలు అగ్రిమెంట్ లు జిరాక్స్ కాపీలు ఇచ్చి కోరనైనది, అందుకు గాను కార్యాలయ ఖర్చులకని రూ. 10,000-00 కార్యదర్శి శ్రీమతి లావణ్య నావద్ద నుండి తీసుకున్నారు. పలు మార్లు వారి స్వంత గ్రామం మాధవరాయిని గూడెం (హుజూర్-నగర్)లో వారిని ఇంటి వద్ద కలిసి కూడా వేడుకున్నాము. కానీ, పంచాయతి అసెస్-మెంట్ రికార్డులలో పేరు మార్పు చేయకుండా ఇంకా కొంత మొత్తము డబ్బులు ఇవ్వమని మమ్ము వేదిస్తున్నారు. ఉద్యోగాన్ని అడ్డుగా చూపి గ్రామములోని కొన్ని రాయకీయ పార్టీలకు అనుకూలంగా విధులు నిర్వహిస్తూ, గ్రామంలో ప్రతిపనికి లంచంగా కొంత మొత్తంలో నగదు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ వేదిస్తుందనీ అక్కడ కొంతమంది గుసగుసలు వినబడుతున్నాయి కావున ఇట్టి విషయమై నాకు న్యాయం చేయగలరని మరియు పంచాయతి అసెస్-మెంట్ రికార్డులలో ఇంటి నెం. 2-89/3ని బేతెస్థ మినిష్ట్రిస్ గా పేరు మార్పు చేయగలరని కలెక్టర్ ను వేడుకోవడం జరిగిందని, ఆమె పైగా ఈ చర్చ్ నీ నీకంటే ముందు వేరే వాళ్ళు కొన్నారని, డాక్యుమెంట్ చూపించండి అంటే బుకయిస్తూ నీ దిక్కున్న దగ్గర చెప్పుకో అనీ నా భర్త పోలీస్ శాఖలో పనిచేస్తున్నారని నువ్వు ఏమి చేయలేవని మమ్ములను నాలుగు నెలలుగా తిప్పుతూ బెదిరిస్తున్నారు అనీ ఆవేదన వ్యక్తం చేశారు









