3,50,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పట్టణ ప్రణాళికాధికారి
జయకేతనం న్యూస్ సెప్టెంబర్27
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏసీబీ అధికారులకు ప్రభుత్వాధికారులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడుతూనే ఉన్నారు ఆయన అధికారుల పనితీరు మారే పరిస్థితి లేకుండా పోతున్నాయి. శనివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లో ఏసీబీ అధికారులకు ఎల్లంపేట పురపాలక సంఘంలోని పట్టణ ప్రణాళిక అధికారి – చింతల రాధా కృష్ణ రెడ్డి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
ఫిర్యాదుధారునికి సంబంధించిన లే-అవుట్ ప్రహరీ గోడను మరియు గేట్లను ఇతర భూ యజమానులకు సౌకర్యాలు కల్పించాలనే సాకుతో తొలగించకుండా ఉండేందుకు” అధికారికంగా సాయం చేసినందుకు ఫిర్యాదుధారుని నుండి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, ఎల్లంపేట పురపాలక సంఘంలోని పట్టణ ప్రణాళిక అధికారి – చింతల రాధా కృష్ణ రెడ్డి. రూ.5,00,000/- డిమాండ్ చేసి, అందులో నుండి ఇప్పటికే రూ.1,50,000/-తీసుకొని,మిగతా రూ.3,50,000/-లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన”వాట్సాప్ (9440446106)ఫేస్ బుక్ (Telangana ACB) ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును. “ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు









