అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గడ్డిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపిక
జయకేతనం న్యూస్ అక్టోబర్ 07
ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గ్లోబల్ గ్యాన్ అకాడమీ కడప ఆధ్వర్యంలో కె ఎస్ ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో
గ్లోబల్ ఇంటర్నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం 1390 దరఖాస్తుల నుండి 20 మంది ఉపాధ్యాయులను తుది జాబితాకు ఎంపిక చేయగా వారిలో జ్యూరీ ఎంపిక చేసిన టాప్ 10 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో అంతర్జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ మోడల్ స్కూల్, గడ్డిపల్లి (సూర్యాపేట జిల్లా)ప్రిన్సిపాల్
డా.జే.ప్రసన్న కుమారిఎంపికయ్యారు. ఆమె ఆవిష్కరణాత్మక బోధనా విధానాలు, విద్యా నాయకత్వం, విద్యార్థి కేంద్రిత అభ్యాసంపై కట్టుబాటు కారణంగా ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది.ఈ అవార్డు తెలంగాణ మోడల్ స్కూళ్లకు మరియు సూర్యాపేట జిల్లా విద్యా వర్గాలకు గర్వకారణంగా నిలిచిందని డా.ప్రసన్న కుమారి తెలిపారు. తనను ఎంపిక చేసిన జూరీ సభ్యులకు గ్లోబల్ గ్యాన్ అకాడమీ కీ కృతజ్ఞతలు తెలియజేశారు.









