చేనేత కార్మికులకు సబ్సిడీ లు పెంచి కార్మికుల ఎదుగుదలకు పాటుపడాలి

చేనేత కార్మికులకు సబ్సిడీ లు పెంచి కార్మికుల ఎదుగుదలకు పాటుపడాలి

నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతీయ అభివృద్ధి అధికారి గణేష కు విన్నవించిన
జాతీయ చేనేత ఐక్యవేదిక

జయకేతనం న్యూస్ అక్టోబర్ 08

చేనేత కార్మికుల అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న పథకాలు మహిళ సంఘాలకు అందిస్తున్న పథకాలలో సబ్సిడీ పెంచి వారికి ప్రోత్సాహకాలను అందించాలని జాతీయ చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున జాతీయ ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ ఇన్చార్జ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలూరి రుషింగప్ప సీనియర్ చేనేత కార్మికుడు గుడ్డేటి సుబ్బారాయుడు లు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాంతీయ అభివృద్ధి అధికారి గణేష ను కలిసి విన్నవించారు చేనేత కార్మికులు వస్త్రాల తయారీకి ముడి సరుకు నూలు సిల్క్ ఉత్పత్తులపై నిబంధనలను సడలించాలని వారికి తోడ్పాటు అందించాలని కోరారు. మరమగ్గాలకు ఉచిత కరెంటు అందించాలని చనిపోయిన చేనేత కార్మికులకు వారి కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందించి కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అనేక రాష్ట్రాలలో చేనేత కార్మికులకు అందిస్తున్న విధంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో అధిక మొత్తంలో సబ్సిడీ పెంచి ప్రోత్సహించాలని, కార్మికుల ఎదుగుదలకు పాటుపడాలని కోరారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్