10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పంచాయతి కార్యదర్శి
జయకేతనం న్యూస్ అక్టోబర్ 10
కరీంనగర్ జిల్లా లో గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ కి చిక్కాడు ఫిర్యాదుధారుని యొక్క ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంకు సంబంధించిన ఫైల్ ప్రాసెస్ చేసేందుదుకు ఫిర్యాదుధారుని నుండి రూ.10,000/- లంచం తీసుకుంటూ గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతి కార్యదర్శి -ఎం. అనిల్ శుక్రవారం కరీంనగర్ జిల్లా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన”వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశాను సంప్రదించవచ్చును. ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు









