15,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన TGSPDCL సబ్-ఇంజనీర్& ఇంచార్జి సహాయక ఇంజనీర్- భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి
జయకేతనం న్యూస్ అక్టోబర్ 10
ఫిర్యాదుధారుడు చేపట్టిన విద్యుత్తు కాంట్రాక్ట్ పనికి సంబంధించిన స్థలంలో సింగిల్ ఫేజ్ మీటర్ల నుండి త్రీ ఫేజ్ మీటర్లకు ఆధునికీకరించడం కోసం సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేయడంతో పాటుగా 63 కె వి ఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుకై అంచనా ప్రతిని సిద్ధం చేయడానికి “ఫిర్యాదుధారుని నుండి రూ.15,000/- లంచం తీసుకుంటూ సికింద్రాబాద్ పద్మారావు నగర్ సబ్-డివిజన్ లోని, లాలగూడ సెక్షన్ TGSPDCL సబ్-ఇంజనీర్ & ఇంచార్జి సహాయక ఇంజనీర్- భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన”వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు









