సర్వే చేసి రిపోర్టు ఇవ్వడానికి30,000/- లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి పట్టుబడ్డ సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్ అతని ప్రైవేట్ సహాయకుడు సూర వంశీ
జయకేతనం న్యూస్ అక్టోబర్ 14
ఫిర్యాదుధారుని తల్లి కి సంబంధించిన భూమిని సర్వే చేయడానికి మరియు పంచనామా ప్రతిని అందించడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- లంచం డిమాండ్ చేసి, ఇప్పటికే రూ.10,000/- తీసుకొని మిగిలిన రూ.20,000/- లంచం తీసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండల తహశీల్దార్ వారి కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న మాడిశెట్టి వేణుగోపాల్ మరియు అతని ప్రైవేట్ సహాయకుడు సూర వంశీ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునని “ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు









