దోనబండ తండా అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసం ఉత్సవం నిర్వహణ
జయకేతనం న్యూస్ అక్టోబర్16
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం దోనబండ తండా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు గురువారం పోషణ మాసం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గర్భవతులకు శ్రీమంతాలు,పిల్లలకు అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ -వెంకటలక్ష్మి, పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో అందించే పౌష్టికాహారం ఎంతో బలవర్ధకమైనని బాలింతలు గర్భవతులు, పిల్లలకు పోషక విలువలు పెంపొందించడంలో అంగన్వాడి కేంద్రాలు అందించే ఆహారం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గర్భవతులు బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలను ఆమె వివరించారు. కార్యక్రమం నందు ఏసీడీపీఓ-శ్రీ లిఖిత,సూపర్వైజర్-నిర్మలా రెడ్డి,బ్లాక్ కోఆర్డినేటర్-రాజేష్, అంగన్వాడి టీచర్ లు మంజుల,రాజ్యలక్ష్మి, సంతోష్ కుమారి కవితఇతర అంగన్ వాడి టిచ్చర్ లు,ఆయాలు, గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ బాలింతలు గర్భవతులు పిల్లలు పాల్గొన్నారు









