8000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి
తాత్కాలిక లైసెన్స్ కొరకు ప్రాసెస్ చేయడానికి కావాల్సిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరి చేయడానికి ఫిర్యాదుదారుని నుండి రూ.8,000/-డిమాండ్
జయకేతనం న్యూస్ అక్టోబర్ 16
ఫిర్యాదుదారుడు బాణసంచా దుకాణం నడపుకోవడానికి చేసుకున్న దరఖాస్తు కు తాత్కాలిక లైసెన్స్ కొరకు ప్రాసెస్ చేయడానికి కావాల్సిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరి చేయడానికి ఫిర్యాదుదారుని నుండి రూ.8,000/- లంచం తీసుకుంటూ నల్లగొండ ఫైర్ స్టేషన్ అధికారి – ఎ.సత్యనారాయణ రెడ్డి తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన”వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు









