విద్యార్థులు బీసీ ఉద్యమానికి సిద్ధం కావాలి
బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్
జయకేతనం న్యూస్ అక్టోబర్15
తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులు ఉద్యమానికి సిద్ధం కావాలని మిర్యాలగూడలో డిగ్రీ కాలేజ్ విద్యార్థులతో సమావేశమైన బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగడుగునా అణిచివేస్తూ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు విద్యార్థి లోకం ముందుండి ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలను విద్యా ఉద్యోగ రాజకీయ రంగం లో పూర్తిగా అన్చివేస్తుందని ఆయన అన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తరహాలోనే బీసీల ఉద్యమం ఉండబోతుందని ఆయన అన్నారు ఉద్యమానికి విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కదలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో.. జక్కా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి గంగాధర్, పట్టేటి రమేష్, శంకర్, నవీన్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు









