70,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా మత్స్యకార అధికారిణి – అల్లు నాగమణి,పొరుగు సేవలఉద్యోగి పెద్దబోయిన హరీష్.
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లోకి 84 మంది నూతన సభ్యుల నమోదు, ఆమోదించిన ఉత్తర్వుల జారీకి లంచం డిమాండ్
జయకేతనం న్యూస్ అక్టోబర్ 17
మత్స్య పారిశ్రామిక సహకార సంఘం లోకి 84 మంది నూతన సభ్యులను చేర్చుకోవడానికి సంబంధించిన దస్తవేజును ప్రాసెస్ చేయడానికి మరియు ఆమోదింపబడిన ఉత్తర్వులు జారీ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.70,000/- లంచం తీసుకుంటూ వరంగల్ జిల్లా మత్స్యకార అధికారిణి – అల్లు నాగమణి మరియు వారి కార్యాలయంలో క్షేత్ర స్థాయి అధికారి (పొరుగు సేవలు)- పెద్దబోయిన హరీష్.
వరంగల్ జిల్లా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన”వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు తెలిపారు









