ఏసీబీ కి చిక్కిన దేవాదాయ శాఖ ఇన్చార్జి ఎస్ఈ రామారావు.
జయ కేతనం న్యూస్ అక్టోబర్ 30
గత వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ యస్ ఈ గా బాధ్యతలు స్వీకరించిన రామారావు
యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా కాంట్రాక్టర్ మిషనరీ సప్లై చేశారు మిషనరీ ఖరీదు సుమారు 11,50,000/- ఆ బిల్లు ఇప్పించడానికి దేవాదాయ శాఖ ఎస్ ఈ 20 శాతం కమీషన్ అడగడంతో ఇద్దరి మధ్యలో 1,90,000/- రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్ నల్గొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి,ఏసీబీ వాళ్ళని కలవడంతో నిఘా పెట్టి మేడిపల్లిలో
నిన్న సాయంత్రం 1,90,000/- లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రామారావుకు హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఉన్న ఇంటిపై కూడా రెండు టీములు దాడులు నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జ్యూడిషల్ రిమాండ్ కొరకు నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారి తెలిపారు. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారుల విజ్ఞప్తి చేశారు.









