6000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లైన్ ఇన్స్పెక్టర్ ప్రభులాల్
జై కేతనం న్యూస్ అక్టోబర్ 29
హైదరాబాద్ లోని పెద్ద అంబర్పేట్లో గల సహాయక ఇంజనీర్(ఆపరేషన్స్) వారి కార్యాలయంలోని లైన్ ఇన్స్పెక్టర్ – ప్రభులాల్ రూ.6000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.ఒక ప్రైవేట్ కళాశాలలో నూతనంగా నిర్మించబడిన అపార్ట్మెంట్లో ఏర్పాటు చేయబడిన 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ మరియు నూతన విద్యుత్ మీటర్లకు సర్వీస్ నంబర్లను విడుదల చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.6,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.









