15000/-లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామ పాలనా అధికారి-బనావత్ శ్రీనివాస్
ఏ 2.30 కుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60,000/-లంచం డిమాండ్
మొదటగా 40,000/- లంచం తీసుకున్న జిపిఓ
జయకేతనం న్యూస్ అక్టోబర్ 27
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి తహశీల్దార్ వారి కార్యాలయములో పూసుగూడెం రెవెన్యూ క్లస్టర్ గ్రామ పాలనా అధికారి-బనావత్ శ్రీనివాస్ రావు 15000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుధారునికి సంబంధించిన 2 ఎకరాల 30 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.60,000/-లంచం డిమాండ్ చేసి, అందులో నుండి మొదటగా రూ.40,000/- తీసుకోవడం జరిగింది. ఫిర్యాదుదారుని అభ్యర్థన మేరకు మిగిలిన రూ.20,000/- నుండి రూ.5000/-తగ్గించి, మిగతా రూ.15000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలన్నారు అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల/బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునన్నారు.









