21,000/- లంచం తీసుకుంటూ ఏసిబి కి చిక్కిన డివిజనల్ ఇంజనీర్- షేక్ చాంద్ షరీఫ్ బాషా
పౌల్ట్రీ ఫారమ్‌కు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం కోసం దస్తావేజును ప్రాసెస్ చేయడానికి లంచం డిమాండ్
జయ కేతనం న్యూస్ అక్టోబర్ 30
ఫిర్యాదుధారునికి చెందిన పౌల్ట్రీ ఫారమ్‌కు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం కోసం దస్తావేజును ప్రాసెస్ చేయడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.21,000/- లంచం తీసుకుంటూ టీజీఎస్పిడిసిఎల్ మెదక్ డివిజన్ యొక్క డివిజనల్ ఇంజనీర్ – షేక్ చాంద్ షరీఫ్ బాషా అనిశా అధికారులకు పట్టుబడినాడు ఈ సందర్భంగా ఎస్బి అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.









