ఏసీబీకి చిక్కిన వ్యవసాయ విస్తరణ అధికారి-జి. సందీప్
రైతు బీమా పరిహారం కొరకు చేసిన దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు 10,000/- డిమాండ్
జయకేతనం న్యూస్ నవంబర్ 11
మహబూబాబాద్ జిల్లాలోని మర్రిపెడ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలోని వ్యవసాయ విస్తరణ అధికారి-జి. సందీప్ 10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.ఫిర్యాదుధారుని తండ్రి రైతు భీమా పరిహార దస్తావేజును ప్రాసెస్ చేసి,దాన్ని ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించడానికి వ్యవసాయ విస్తీర్ణ అధికారి సందీప్ రూ.10,000/- లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు లంచం ఇవ్వడానికి ఇష్టపడక ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో గురువారం వ్యవసాయ అధికారి 10,000/- లంచం స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అనిశా అధికారులకు దొరికాడు.









