75000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గురుబెల్లి వెంకట్ నర్సింహారావు
లారీలలో పిడిఎఫ్ బియ్యాన్ని గోదాముల కు రవాణా చేసేందుకు లంచం డిమాండ్
జయకేతనం న్యూస్ నవంబర్ 06
ఆసిఫాబాద్ జిల్లా పౌర సరఫరాల కార్యాలయపు మేనేజర్ -గురుబెల్లి వెంకట్ నర్సింహారావు మరియు సాంకేతిక సహాయకుడు (పొరుగు సేవలు)-కొత్తగొల్ల మణికాంత్ లు 75,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుధారునికి చెందిన లారీలలో లోడ్ చేయబడిన పిడిఎస్ బియ్యాన్ని అతని గోదాము నుండి ఆసిఫాబాద్‌లోని పౌర సరఫరాల గోదాముకు రవాణాను అనుమతించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.75,000/-లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను సంప్రదించడంతో ఏసీబీ అధికారుల సూచనల మేరకు అధికారులకు 75,000/- లంచం అందజేస్తుండగా అధికారులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చునన్నారు.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని తెలిపారు.









