హుజూర్ నగర్ తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ శ్రీనివాస్ రావు
జయకేతనం న్యూస్ నవంబర్ 06
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నూతన తహసీల్దార్ గా సిహెచ్ శ్రీనివాస్ రావు బాధ్యతలు చేపట్టారు.హుజూర్ నగర్ ఆర్ డీ ఓ కార్యాలయంలో భూ సేకరణ సెక్షన్ నిర్వహిస్తున్న నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు ను హుజూర్ నగర్ తహసీల్దార్ (ఎఫ్ఏసి) గా నియమిస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం హుజూర్ నగర్ తహసీల్దార్ (ఎఫ్ఏసి) సిహెచ్ శ్రీనివాస్ రావు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది ఆర్డీవో కార్యాలయ అధికారులు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.









