
రూ.30,000/-లంచం తీసుకుని పారిపోతుండగా ఎస్సై రాజేష్ ను చేదించి పట్టుకున్న ఏసీబీ
జయకేతనం న్యూస్ నవంబర్ 18
ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- లంచం తీసుకుంటూ మెదక్ జిల్లాలోని టేక్మాల్ రక్షక భట నిలయాధికారి, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అవినీతినిరోధకశాఖ అధికారుల రాకను పసిగట్టిన ఎస్.ఐ. తీసుకున్న లంచంతోపాటు పారిపోతుండగా, అధికారులు అతన్ని వెంబడించి వ్యవసాయ పొలాలలో పట్టుకున్నారు. ఫిర్యాదుధారుని పైన మరియు అతని సహచరులపైన టేక్మాల్ రక్షక భట నిలయంలో నమోదైన ఒక కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసినందుకు(అట్టి కేసు లోక్ అదాలత్లో పరిష్కరించబడింది) ఎస్సై 30000/- లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు మంగళవారం ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో వారినిచూసి లంచం సొమ్ముతో పారిపోతుండగా ఏసీబీ అధికారులు చేదించి పట్టుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
ఏసీబీ రైడ్ చేసి ఎస్సైను పట్టుకోవడంతో పోలీస్ స్టేషన్ ఎదుట టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.









