
1,00,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్ కాలువ కిరణ్ కుమార్,చైన్ మెన్ – మేకల భాస్కర్
జయకేతనం న్యూస్ నవంబర్ 18
ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్యతీసుకోకుండా ఉండేందుకు హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని మండల సర్వేయర్ – కాలువ కిరణ్ కుమార్ మరియు చైన్ మెన్-మేకల భాస్కర్ లు ఫిర్యాదుదారు ని నుండి రూ.3,00,000/-లంచం డిమాండ్ చేయడం తో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అందులో మొదటి విడతగా రూ.1,00,000/- ఫిర్యాదు దారుడి నుండి తీసుకుంటూ సర్వేయర్-కాలువ కిరణ్ కుమార్ మరియు చైన్ మెన్ – మేకల భాస్కర్ లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు









