
10,000/-లంచంను తన సహాయకుడికి
యుపీఐ చేయించుకుని ఏసీబీకి చిక్కిన
కూనమల్ల సంధ్యా రాణి
జయకేతనం న్యూస్ నవంబర్ 21
ఫిర్యాదుధారుని చేత పూర్తిచేయబడిన మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో తనిఖీ చేసి వాటితోబాటు సంబంధిత చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజనీర్ కి పంపించడానికి ఫిర్యాదుధారుని నుండి డిమాండ్ చేసిన రూ.10,000/- లంచం ను తన యొక్క ప్రైవేట్ సహాయకుడు అయిన మహేందర్ యొక్క యుపీఐ ఖాతా ద్వారా తీసుకుంటూ జనగాం జిల్లాలోని పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (ఐ ఎన్ టి ఆర్ ఎ) ఉపకార్యనిర్వాహక ఇంజనీరు – కూనమల్ల సంధ్యా రాణి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.









