20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమీషనర్
భూమేష్ వద్ద లెక్కలు తెలుపని రూ.4,30,000/- నగదు
జయకేతనం న్యూస్ నవంబర్ 27
ఫిర్యాదుధారుడు నూతనంగా నిర్మించుకున్న బహుళ అంతస్థుల భవనానికి ఇంటి నంబర్ ను కేటాయించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/-లంచంను నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పురపాలక కమీషనర్ ఎ.రాజు తన ప్రైవేట్ డ్రైవర్ భూమేష్ ద్వారా తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.లంచం డబ్బులతో పాటుగా భూమేష్ వద్ద లెక్కలు తెలుపని రూ.4,30,000/- నగదు కలిగి ఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు









