15000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్ వీరగంటి మహేందర్

15000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్ వీరగంటి మహేందర్

జయకేతనం న్యూస్ నవంబర్ 28

ఫిర్యాదుధారురాలి భర్తకు తన మామ నుండి వారసత్వంగా గల వ్యవసాయ భూమికి సంబంధించి,తనకు అనుకూలంగా వారసత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రాసెస్ చేయడానికి మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద వంగర మండల తహసిల్దారు & జాయింట్ సబ్ రిజిస్ట్రార్-వీరగంటి మహేందర్ ఫిర్యాదుధారురాలి నుండి లంచం గా రూ.15,000/- డిమాండ్ చేసి, అట్టి మొత్తాన్ని తన ప్రైవేట్ డ్రైవర్ అయిన తుప్పాని గౌతమ్ ద్వారా తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్