జయకేతనం న్యూస్ ఆగస్టు 12
నేరేడుచర్ల-మిర్యాలగూడకు కేవలం 15 కిలోమీటర్ల దూరం కి వసూలు చేస్తున్న టికెట్ ధరలను పునః పరిశీలించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాల ధనుంజయ నాయుడు మిర్యాలగూడ డిపో మేనేజర్ కు మరియు ఆర్టీసీ ఎండి సంజనార్ కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లో పట్టణ ప్రజా సంఘాలకు చెందిన నాయకులతో కలిసి ఆర్టీసీ బస్సు ముందు నిలబడి నిరసన తెలియజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ కు 15 కిలోమీటర్ల దూరం కి పల్లె వెలుగు బస్సు చార్జి 50 రూపాయలు ఎక్స్ప్రెస్ చార్జి 60 రూపాయలుగా డీలక్స్ చార్జి 70 రూపాయలుగా లగ్జరీ బస్సు చార్జి 95 రూపాయలుగా వసూలు చేస్తున్నారని అదే నేరేడుచర్ల నుంచి కోదాడకు 35 కిలోమీటర్ల దూరం కి కేవలం 40 రూపాయలు ఛార్జి మాత్రమే వసూలు చేస్తున్నారని ఇది ఎక్కడి విడ్డూరమని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ఆర్టీసీ ఎండి సజ్జనార్ జోక్యం చేసుకుని టికెట్ల ధరలను పరిశీలన చేసి నేరేడుచర్ల నుంచి మిర్యాలగూడ కు 30 రూపాయలు చార్జి మాత్రమే వసూలు చేయాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకుగాను, పురుషులపై ఇంత భారం మోపడం సమంజసం కాదని మహిళల ఉచిత ప్రయాణ వల్ల బస్సులో కూడా పురుషులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉచిత ప్రయాణం చేసేవారు సీట్లలో కూర్చుంటే టికెట్ కొన్నవారు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని అందుకొరకు స్త్రీ లకు స్పెషల్ బస్సులు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ యువజన విభాగం నాయకులు రాపోలు నవీన్ కుమార్ నేరేడుచర్ల మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాస్ రెడ్డి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, సామాజిక కార్యకర్త యారవ సురేష్, తక్కెళ్ళ నాగార్జున, రామ్ సైదులు సిపి ఐ మండల అధ్యక్షుడు ఊదర వెంకన్న, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమ్మరాజు వెంకట్ ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికె భరత్, ఎస్.కె నాగుల్ మీరా, బత్తిని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.









