ఎమ్మెల్సీ మల్లన్న పార్టీ “తెలంగాణ రాజ్యాధికార పార్టీ”(టీఆర్పీ)

ఎమ్మెల్సీ మల్లన్న పార్టీ “తెలంగాణ రాజ్యాధికార పార్టీ”(టీఆర్పీ)

అధ్యక్షుడిగా మల్లన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా మాదం రజినీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్‌

ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్‌

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 17

తెలంగాణ రాజకీయాలలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సొంతంగా ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్పీ) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ కృష్ణా హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండాను కూడా తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలయికతో ఈ జెండాను రూపొందించారు. పార్టీ స్థాపనతో పాటు, కీలకమైన రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఆయన ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న బాధ్యతలు చేపట్టనుండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాదం రజినీ కుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్‌లను పార్టీ ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యారావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్‌లను నియమిస్తున్నట్టు మల్లన్న ప్రకటించారు. త్వరలోనే పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని మిగిలిన విభాగాలకు సంబంధించిన కార్యవర్గాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్