కామేపల్లి మండలం లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జెండా ఎగురవేస్తున్న మేకల మల్లిబాబు యాదవ్

జయకేతనం న్యూస్ ఆగస్టు 16

79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కామేపల్లి మండలం లో ఘనంగా జరిగాయి. పలుచోట్ల జరిగిన వేడుకల లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు తమ ధన,మాన ప్రాణాలను లెక్క చేయకుండా స్వాతంత్ర్య పోరాటం లో అమరవీరుల య్యారని, వారందరి త్యాగ ఫలితం గా ఈ రోజు స్వేచ్చ అనుభవిస్తున్నామని తెలిపారు. 200సంవత్సరాలు మన దేశం ను పరిపాలించిన బ్రిటిష్ వారు మన దేశ సంపద ను దోచుకొని,లూటీ చేసి ఏమీ లేకుండా చేసినప్పటికీ, మన దేశాన్ని ముక్కలు చేసినప్పటికీ కేవలం కొద్ది కాలంలోనే మన దేశ నాయకులు, మేధావులు ఈరోజు దేశాన్ని అభివృద్ధి పరచుకోవడంలో ఎంతో గొప్ప ముందడుగు వేశారు. పరిపాలించిన దేశాన్ని అభివృద్ధిలో అధిగమించడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే మన దేశంలో ఇంకా దారిద్రం పేదరికం నిర్మూలన కాలేదు.మహాత్మా గాంధీభగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు లాంటివారు కోరుకున్నట్టు సమ సమాజ స్థాపన జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బానోతు నరసింహ నాయక్,మేకపోతుల మహేష్ పాటిబండ్ల ప్రసాద్ మేకల మల్లికార్జునరావు భూక్య నాగేంద్రబాబు చల్ల మల్లయ్య రాయల నాగ శంకర్ పందుల రామ్మూర్తి మోదుగు ఆనందరావు పాటిబండ్ల రమేష్, గుండ్ల ఏసోబు,ఆర్.ఎం.పి సాంబశివరావు, శీలం పుల్లయ్య,నాగండ్ల జగ్గయ్య, గుగులోత్ రవి,పలిమల రాజేష్,గుండ్ల కృష్ణ బత్తుల వీరభద్రం,నీరుడు ఏడుకొండలు,హై స్కూలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్