జయకేతనం న్యూస్ ఆగస్టు 22
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు తెలంగాణ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీసు సామూహికంగా 500 మొక్కలు నాటడం జరిగిన. అదనపు ఎస్పీ లు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డి.ఎస్.పి లు ప్రసన్న కుమార్, నరసింహ చారి, శ్రీధర్ రెడ్డి, సి ఐ లు ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పి నరసింహ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహోత్సవం కార్యక్రమం నిర్వహించి సామూహికంగా మొక్కలు నాటాము. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ రక్షణకు ప్రకృతి పరిరక్షణకు పాటుపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. వన మహోత్సవం ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పోలీసు భాగస్వామ్యమైన, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలన్నారు









