కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు అన్యాయం

జయకేతనం న్యూస్ ఆగస్టు 22

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందని బి ఆర్.టి.యూ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం బి ఆర్ టి యు ఆటో యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులకు జీవనోపాధి కరువైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల కొరకు సంవత్సరానికి 12000 ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదన్నారు.మీ సమస్యల పరిష్కార కొరకు బిఆర్ఎస్ పార్టీ పని చేస్తుందన్నారు. ఆటో కార్మికుల ఐక్యంగా ఉంటూ తమ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. బి.ఆర్ .టి. యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుర్రి సైదులు, అహ్మద్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఐదు లక్షలు ప్రమాద బీమా ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ బీమాను రెన్యూవల్ చేయడం లేదన్నారు.ఆటో కార్మికుల డిమాండ్ ఐదు లక్షల ప్రమాద బీమా,ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్లకు 20 లక్షల ఎక్స్గ్రేషియా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.ఆటో కార్మిక సమస్య పరిష్కార కొరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు, కార్మికులు ప్రభుత్వానికి మన సమస్యలు తెలిసే విధంగా పోరాటాలు నిర్వహించాలన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మన సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా కృషి చేస్తాన ని తెలిపారు అన్నారు.. ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు గుండె వెంకన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెరుమాళ్ళ లింగయ్య పట్టణ అధ్యక్షులు సిహెచ్ ఖుషి వెంకన్న పట్టణ ఉపా అధ్యక్షులు పి శ్రీనివాస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అహ్మద్,పట్టణ ఆటో యూనియన్ అడ్డాల అధ్యక్షులు పడిశాల శేఖర్( కుడ కుడ)పబ్బ వెంకన్న (మంగళ్యా షాపింగ్ మాల్)సొందు మియా (రాజీవ్ నగర్)
రామారావు (దురాజ్ పల్లి)బాలయ్య (నిర్మల హాస్పిటల్)కొల్లి వెంకన్న (డి మార్ట్)పొన్నం నాగరాజు, లింగం రాములు, రాపర్తి శ్రీనివాస్, విజయ్, నసీర్, రాజకుమార్, సైదులు,మల్లయ్య, దిలీప్,వీరబాబు, రఫీ,వీరస్వామి, సిహెచ్ వెంకయ్య, డి రాజు, వెంకన్న, సంతు, ఆర్ .నవీన్, మేకల రమేష్, లింగమల్లు,కదిరే జానయ్య, తండు సతీష్, నక్క వెంకన్న, గట్ల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్