

జయకేతనం న్యూస్ ఆగస్టు 22
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు.నేరాలు జరగకుండా సాంకేతికత సద్వినియోగం చేసుకుని ప్రజల భాగస్వామ్యంతో పటిష్టంగా పని చేయాలని,సమిష్టిగా పని చేయాలని, అసాంఘిక కార్యకలాపాలు,అక్రమ రవాణా నిరోధంలో క్షేత్ర స్థాయిలో నిఘా ఉంచాలని, ప్రతి అంశాన్ని రికార్డ్స్ లో నమోదు చేయాలని పోలీసు అధికారును ఎస్పి నరసింహ ఆదేశించారు.ఈ సమీక్ష లో భాగంగా కేసుల దర్యాప్తు, కోర్టు పెడింగ్ కేసులు, దర్యాప్తు పెండింగ్ కేసులు, వాహనాల తనిఖీలు, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ నైట్ అలర్టింగ్ అధికారి విధులు, హైవే పెట్రోలింగ్, కార్డన్ అండ్ సెర్చ్, దొంగతనాల కేసుల్లో నగదు స్వాధీనం మొదలగు అంశాలను సమీక్షించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని, పెట్రోలింగ్, బీట్స్ సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశించారు. దుకాణ సముదాయల్లో, కాలనీలలో, గ్రామాల్లో, రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని, దీనిపై ఎక్కువగా దృష్టి సారించాలని అన్నారు. సైబర్ మోసాలపై, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి అన్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీసులు బాగా పని చేశారు, భవిష్యత్తులో కూడా ఇలాగే పని చేయాలి అని అన్నారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పటిష్టంగా పని చేయాలి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజల్లో అవగాహన కల్పించాలి అన్నారు.
సిబ్బందికి రికార్డ్స్
విధుల నిర్వహణలో బాగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్డ్స్ అందించారు. జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ పై వచ్చి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసిన కేసులో హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు, మఠంపల్లి ఎస్సై బాబు, ఐటి టెక్నాలజీ ఆర్.ఎస్.ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ శంబయ్య లకు రివార్డ్స్ అందించి అభినందించారు. పని విభాగాలలో బాగా పనిచేసిన ఎస్సైలు చివ్వెంల ఎస్సై మహేశ్వర్, నాగారం ఎస్సై ఐలయ్య, సూర్యాపేట రూరల్ 2వ ఎస్సై రాములు లకు రివార్డ్స్ అందించారు .ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్, జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డి.ఎస్.పి ప్రసన్నకుమార్, కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి, ఏఆర్ డి.ఎస్.పి నరసింహ చారి, ఏవో మంజు భార్గవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, డి సి ఆర్ బి ఇన్స్పెక్టర్ హరిబాబు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు చరమంద రాజు, లింగయ్య, శివ శంకర్, రాజశేఖర్, నాగేశ్వరరావు, రామకృష్ణా రెడ్డి, నరసింహారావు, ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు









