
టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ సహాయక డివిజనల్ ఇంజనీర్ పై ACBఅక్రమాస్తుల కేసు నమోదు
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 16
హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌లో గల టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ లోని సహాయక డివిజనల్ ఇంజనీర్(ఆపరేషన్స్) ఇరుగు అంబేద్కర్ పైన తెలంగాణ అనిశా అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేశారు. అనిశా అధికారులు అతనికి మరియు అతని బంధువులకు సంబంధించిన 11 ప్రదేశాలలో సోదాలు నిర్వహించి హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాలలో ఒక గృహము, ఒక భవనము (జి+5), ఓపెన్ ప్లాట్లు (2), సూర్యాపేట జిల్లాలోని పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల భూమిలో ఒక రసాయన కంపెనీ (ఆంథర్ కెమికల్స్) తో పాటుగా బంగారు ఆభరణాలు మరియు నాలుగు చక్రాల వాహనాలు 2 తో కూడిన స్థిర & చరాస్థులతో పాటు రూ.2,18,00,000/- నగదును కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. కేసు దర్యాప్తులో ఉన్నదని ఏసీబీ అధికారులు తెలిపారు
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి”. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
“ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును









