
ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందవా
90 సంవత్సరాల వృద్ధురాలి జీవితం పనిచేయలేని కొడుకు సేవలోనే
జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 16
సామాజిక ఉద్యమకారుడు హుజూర్నగర్ అభివృద్ధి కొరకు ఎన్నో విధాలుగా ఉద్యమాలు చేసి చివరకు టౌన్ హాల్ పక్కన చిన్న గుడిసెలో జీవితం గడుపుతున్న నిజమైన లబ్ధిదారునికి నేటి వరకు వికలాంగుల సర్టిఫికెట్ కూడా మంజూరు చేయలేక పోయిన ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందని ద్రాక్షాల తయారయ్యాయనడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో టౌన్ హాల్ ప్రక్కన నివసించే బరిగెల చంద్రశేఖర్ మాదిగ నియోజకవర్గంలో రెవిన్యూ డివిజన్ కొరకు,మాదిగల అభివృద్ధి కొరకు ఎన్నో మార్లు సామాజిక ఉద్యమాలు చేశారు, రోడ్లు భవనాలు ప్రభుత్వ కార్యాలయాలు కావాలని 1994 నుండి ఎన్నో ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎంత గుర్తింపు ఉన్న అరుదైన వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో హుజూర్నగర్ పట్టణంలోని టౌన్ హాల్ ప్రక్కన నాలుగు రేకులేసుకుని జీవితం గడుపుతున్నాడు 90 సంవత్సరాల వయసులో కూడా అన్ని తానై తల్లి వృద్ధాప్యంను కూడా లెక్కచేయకుండా తన కుమారుడు కోసం ఇంకా శేష జీవితాన్ని పనిచేయలేని స్థితిలో కూడా తన వయసును కూడా లెక్కచేయకుండా బ్రతుకు జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. పనిచేయలేని స్థితిలో ఇద్దరు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న కళ్ళకు గత పదేళ్ల గా కన్నీళ్లే మిగిలాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి బరిగెల చంద్రశేఖర్ మాదిగకు ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు, వికలాంగుల సర్టిఫికెట్, పెన్షన్, బతకడానికి భరోసా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు









