భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి మండల ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తఫా

జయకేతనం న్యూస్ ఆగస్టు 22

హుజూర్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో షేక్ ముస్తఫా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి అనుబంధ సంఘం సూర్యాపేట జిల్లా 3వ మహాసభలను బుధవారం ఉద్యమాల పూర్తిగడ్డ తుంగతుర్తి ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు సెప్టెంబర్ 1న ఉదయం 10 గంటలకు జరగనున్న మహాసభలను అన్ని గ్రామాల కార్మికులు కదలి వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందమైన భవనాలు బహుళ అంతస్తులు నిర్మిస్తున్న భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి తాపీ మేస్త్రీలు, మట్టి పని వారు ,రాడ్ బిల్డింగ్, సెంట్రింగ్, కాంక్రీట్, పెయింటర్స్ కార్పెంటర్స్, ప్లంబర్స్ మార్బుల్స్, టైల్స్, ఎలక్ట్రిషన్ శానిటర్ హౌస్ వెల్డింగ్, పి ఓ సి, ఇంటీరియల్ ,డిజైనింగ్ గ్లాస్ ఫిట్టింగ్ స్టోన్ క్రషర్ ఇటికబట్టి రాయి కొట్టి, సిమెంట్ బ్రిక్స్, ఇతర ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల అంతా కలిసి రావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న క్లైములను తక్షణమే పరిష్కరించాలని 50 సంవత్సరాలు దాటిన కార్మికుడికి తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని పనిముట్ల కొరకు ఆర్థిక సహాయం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అడ్డాలు, మౌలిక సదుపాయాలు, అనేక అంశాలపై పోరాటాల నిర్వహించాము అలాగే సంక్షేమ పథకాలపై జరుగుతున్న అవినీతి అరికట్టాలని జిల్లా వ్యాప్తంగా కార్మికులను ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారాల వ్యతిరేకిస్తూ పోరాటాలు నిర్వహిస్తామని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిర్మాణ రంగంలో అనేక పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కావున హుజూర్నగర్ మండలం నుంచి కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోజానీ పాషా శాంతయ్య నారాయణ వెంకట్ నర్స్ మల్లేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్