భారత సైన్యంలో యాదవ (అహీర్) రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలి

 

 

భారత సైన్యంలో దేశ రక్షణ దృష్ట్యా యాదవ (అహీర్) రెజిమెంట్ ను ఏర్పాటు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శ్రీకృష్ణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. భారత సైన్యంలో యాదవ రెజిమెంట్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఎంజీ రోడ్ లోని మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలవేసి మాట్లాడారు. 1962లో భారత్ చైనాకు జరిగిన యుద్ధంలో 124 మందిలో సింహ భాగం 114 మంది యాదవ సైనికులు వీరమరణం పొందారని వారి ప్రాణత్యాగం చిరస్మరణీయమని తెలిపారు. రెజంగ్లా రాజ్ (యాదవ) కలశ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 24న బీహార్ రాష్ట్రంలో ప్రారంభమైందని నవంబర్ 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుందని చెప్పారు. 1998వ సంవత్సరంలో భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో 19 బుల్లెట్లు తగిలినా మహేంద్ర యాదవ్ మృత్యుంజయుడుగా నిలిచిన సందర్భంగా ఆయన ధైర్యం సాహసానికి పరమవీర చక్ర అవార్డు ను పొందడం యావత్ యాదవ జాతి గొప్పతనానికి ప్రతీక అని తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లోడంగి గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు యాదవ్, పిసిసి ఓబీసీ విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ తండు శ్రీనివాస్ యాదవ్, దురాజ్ పల్లి పెద్దగట్టు చైర్మన్ పోలేబోయిన నరసయ్య యాదవ్,మాజీ ఛైర్మన్ లు కోడి సైదులు యాదవ్,మద్ది శ్రీనివాస్ యాదవ్, తెలుగు దేశం రాష్ట్ర పరిశీలకులు బయ్య నారాయణ యాదవ్, సీనియర్ జర్నలిస్ట్ వజ్జె వీరయ్య యాదవ్, మట్టిపల్లి సైదులు యాదవ్, తగుళ్ల జనార్థన్ యాదవ్,కోడి శివ,అన్నమయ్య రాము,కుర్ర నర్సయ్య, బయ్య దయాకర్,మాజీ సైనికులు జక్కుల శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్