భారీ వర్షాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగినంత సిబ్బందితో బృందాలు ఏర్పాటు

జయకేతనం న్యూస్ ఆగస్టు 14

భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు.గురువారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలఅధికారులతో భారీ వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్ష సందర్భంగా సూర్యాపేట జిల్లాలో పరిస్థితిని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వివరిస్తూ భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు పని చేసే విధంగా అధికారులు సిబ్బందికి విధులు కేటాయించామని అన్ని శాఖల తో సమన్వయం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.జిల్లాలో ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు లేవని, నల్గొండ జిల్లాలో అందుబాటులో ఉన్నాయని ,జిల్లా అగ్నిమాపక శాఖ సమన్వయంతో మూడు ఎస్డిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.జిల్లా, డివిజన్ ,మండల స్థాయిలో భారీ వర్షాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగినంత సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పరిధిలో మూడు ప్రాజెక్టులు ఉండగా,మూసి ప్రాజెక్టు నుండి 2500 క్యూసెక్కుల,నాగర్జున సాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ నుండి 2000 క్యూసేక్కుల నీరుప్రవహిస్తున్నదని తెలిపారు.మూసి ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలందరిని అప్రమత్తం చేయడం జరిగిందని,మూసి వాగు పొంగి ప్రవహిస్తున్న కారణంగా మిర్యాలగూడ-సూర్యాపేట రహదారిపై భీమారం బ్రిడ్జ్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి స్పందిస్తూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా కనీస స్థాయిలో నీటిని విడుదల చేసేలా చూసుకోవాలని,ఎక్కువగా నీరు వదిలినట్లయితే కాల్వ తెగిపోయే ప్రమాదం ఉందని ,అందువల్ల నీటిని నియంత్రించాలని చెప్పారు. ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో జిల్లా ఎస్పి కే నరసింహ,అదనపు కలెక్టర్ పి రాంబాబు ఆర్డీఓ వేణు మాధవ్, డి ఆర్ డి ఏ పిడి వివి అప్పారావు, ఆర్ & బి ఎస్ ఈ సీతరామయ్య, డి ఎం హెచ్ ఒ చంద్రశేఖర్, పశు సంవర్ధక అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జి జి హెచ్ సూపరిటీడెంట్ శ్రవణ్ కుమార్, పి ఆర్ ఈ ఈ మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్