రూ.30.000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాహసిల్దార్

రూ.30.000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తాహసిల్దార్

మండల రేషన్ దుకాణ డీలర్ల అధ్యక్షుడు-పోతు శబరీష్ ద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

జయకేతనం న్యూస్ నవంబర్ 17

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల తహశీల్దార్ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ -మహ్మద్ యాకూబ్ పాషా మరియు గిరిజన సహకార సంఘం ఇల్లందు యొక్క సాంకేతిక సహాయకుడు (ఈ-పాస్) విజయ్ కుమార్ లు ఫిర్యాదుధారుని నుండి రూ.30.000/- లంచం డిమాండ్ చేసి,ఇల్లందు మండల రేషన్ దుకాణ డీలర్ల అధ్యక్షుడు-పోతు శబరీష్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పనివేళల్లో దుకాణం మూసివేయడం మరియు స్టాక్ కొరత గురించి ఫిర్యాదుధారుని దుకాణంపై నివేదికను పంపకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు గా ఏసీబీ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ (9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్