సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై,ఇండ్లపై తెలంగాణ ఏసీబీ దాడులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలపై,ఇండ్లపై తెలంగాణ ఏసీబీ దాడులు

దాడుల్లో పాల్గొన్న 23 బృందాలు

13 మంది సబ్ రిజిస్టార్ ల ఇళ్లలో కూడా సోదాలు ఇళ్ల నుండి నగదు, నగలు మరియు ఆస్తి పత్రాలను స్వాధీనం

తనిఖీలో,లెక్కల్లో చూపని రూ.2,51,990/-స్వాధీనం

జయకేతనం న్యూస్ నవంబర్ 15

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో తెలంగాణ ఏసిబి అధికారులు నవంబర్ 14న ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మొత్తం 23 బృందాలు గండిపేట, శేరిలింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెదపల్లి, భూపాలపల్లి మరియు వైరాలోని ఎస్ ఆర్ ఓ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. తనిఖీలో, లెక్కల్లో చూపని రూ.2,51,990/- మొత్తాన్ని కార్యాలయాల నుండి స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఈ కార్యాలయాల్లో ఇతర అవకతవకలు ఏసీబీ అధికారులకు కనిపించాయి. దాదాపు 289 రిజిస్టర్డ్ పత్రాలు కూడా కనుగొనబడ్డాయి వాటిని సంబంధిత అధికారులకు అందజేయలేదు. దాదాపు 19 మంది ప్రైవేట్ వ్యక్తులు మరియు 60 మంది డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎటువంటి అనుమతి లేకుండా ఎస్ ఆర్ ఓ (సబ్ రిజిస్టార్) కార్యాలయాల్లో పనులు చేయించుకుంటూ రావడం పోవడం గుర్తించారు. అనేక సిసి టీవీ కెమెరాలు పనిచేయడం లేదు.ఈ అక్రమాలను ఏసిబీ తీవ్రంగా పరిగణిస్తోంది మరియు తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపనుంది.ఏసిబీ బృందాలు 13 మంది సబ్ రిజిస్టార్ ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించి, వారి ఇళ్ల నుండి నగదు, నగలు మరియు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి, ఇవి పరిశీలనలో ఉన్నాయని ఏసీబీ అధికారులు ప్రకటన విడుదల చేశారు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసిబీ యొక్క టోల్ ఫ్రీ నంబర్‌ను అంటే 1064ను సంప్రదించాలని కోరారు.ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వాట్సాప్ (9440446106),ఫేస్బుక్ (తెలంగాణ ఏసీబీ) ఎక్స్/గతంలో ట్విట్టర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. బాధితుడు/ఫిర్యాదుదారుడి పేరు మరియు వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్