వ్యాపార అభివృద్ధి దాత సమాజ సేవకుడు ఇక లేరు

 

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 10

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సెక్రటరీగా పనిచేసి నియోజకవర్గ కేంద్రంలో రైస్ మిల్లుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, కార్మికుల పక్ష పాతిగా కార్మికులకు ఎనలేని సేవలను అందించిన మహనీయుడు గెల్లి అప్పారావు. వ్యాపారవేత్తగా ఆయన వ్యాపారాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించడంతోపాటు సామాజిక సేవలో కూడా నియోజకవర్గ కేంద్రంలో ముందుండి నిలబడి రోటరీ క్లబ్ అధ్యక్షునిగా కూడా సమాజ శ్రేయస్సుకు ఎంతో కృషి చేశారు. సాయం కోసం తన వద్దకు వచ్చిన వారికి లేదనకుండా సాయం చేయడంలో వెనకాడని మహనీయుడు గెల్లి అప్పారావు. బుధవారం ఉదయం హార్ట్ స్ట్రోక్ తో ఆయన స్వర్గస్తులవడంతో హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు పొలిశెట్టి లక్ష్మి నరసింహారావు, ఓరుగంటి నాగేశ్వరరావు గజ్జి ప్రభాకర్ గెల్లి రంగారావు విద్యాసాగర్ బోనాల సాగర్ మట్టపల్లి వెంకటనారాయణ కొత్త శ్రీనివాసరావు కనమర్ల పూడి మురళి మట్టపల్లి శ్రీమన్నారాయణ బూరుగు శ్రీనివాసరావు పెండ్యాల నాని తన్నీరు మల్లికార్జున్ నూనె యాదగిరి తదితరులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మరణించిన తరువాత కూడా నేత్రదానం చేసిన మహనీయుడు

అన్ని దానాల కన్నా నేత్రదానం మిన్న అని నానుడిని అక్షరాల పాటిస్తూ తాను వ్యాపారవేత్తగా వ్యాపార అభివృద్ధి కార్మికుల సంక్షేమంతో పాటు సమాజానికి సేవ చేయడమే కాకుండా తన మరణాంతరం తన కంటిని దానం చేసిన మహోన్నతుడు గెల్లి అప్పారావు. వాసవి క్లబ్- వాసవి వనిత క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ ఆధ్వర్యంలో డైమండ్ నేత్ర నిధికి గెల్లి అప్పారావు నేత్రాలను కుమారుడు గెల్లి రవి దానం చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్