
*సాదా బైనామా భూములకు లైన్ క్లియర్*
జయకేతనం న్యూస్ హైదరాబాద్ సెప్టెంబర్ 11
సాదా బైనామా భూములకు లైన్ క్లియర్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాదా బైనామా దరఖాస్తుల క్రమబద్దీకరణ కోసం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు (జీఓ ఎంఎస్ నెంబర్ 106) జారీ చేసింది.2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 10 వరకు లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదెకరాల లోపు వ్యవసాయ భూముల సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించగా, అట్టి సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నోమార్లు పలు వేదికలలో క్రమబద్ధీకరించేందుకు హామీ ఇవ్వడంతో భూభారతి చట్టం 2025 సెక్షన్ 6(1) ప్రకారంచేపట్టనున్నారు









