5నెలలుగా జీతాలు లేక రోడ్డున పడ్డ 104 ఉద్యోగులు

👉 *రోడ్డున పడ్డ 104 ఉద్యోగులు*
5నెలలుగా జీతాలు లేక ఉద్యోగుల అవస్థలు*
👉 *ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అర్ధ నగ్నంగా అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చి నిరసన*

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 12
కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి హయాంలో 104 (అంబులెన్స్) గ్రామీణ సంచార వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకుగాను1072 మంది ని ఔట్సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించారు. 2009 నుంచి 2022 వరకు వీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 104 వాహనాలను నిలుపుదల చేసి ఆ శాఖలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులను వైద్యశాఖలోని వివిధ విభాగాలలో సర్దుబాటు చేశారు. దీంతో వీరు తమకు కేటాయించినటువంటి విభాగాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వీరికి నెలనెలా జీతాలు ఇవ్వకుండా మొండికేయడంతో వీరి కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది గత 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో వీరి కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు శుక్రవారం నందిపాటి సైదులు అనే ఉద్యోగి తీవ్ర ఆవేదనతో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇస్తూ అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేసి తన ఆవేదనను వెలిబుచ్చారు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేశారు

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్