20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్

20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్
జయ కేతనం న్యూస్ డిసెంబర్ 09

ఫిర్యాదుధారుని పైన నమోదయిన పీడీఎస్ రైస్ కేసును తొలగించడానికి మరియు అతనికి జరిమానా విధించి అతని రేషన్ దుకాణాన్ని తెరుచుకోవడం కోసం సహాయం చేసేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/- లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరు వారి కార్యాలయంలోని జిల్లా పౌర సరఫరాల అధికారి వారి కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ తహశీల్దార్ హనుమ రవీందర్ నాయక్ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధకశాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన వాట్సాప్ 9440446106,ఫేస్ బుక్ Telangana ACB, ఎక్స్@TelanganaACB మరియు వెబ్ సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చును.ఫిర్యాదుధారుల/ బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడునని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్