9౦ కిలొల ప్లాస్టిక్ ను శస్త్రచికిత్స ద్వారా తొలగింపు

9౦ కిలొల ప్లాస్టిక్ ను శస్త్రచికిత్స ద్వారా తొలగింపు

జయకేతనం న్యూస్ సెప్టెంబర్ 18

 

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఒక రైతుకు చెందిన 9 సంవత్సరాల ఆవు కొద్ది రోజులుగా పొట్ట ఉబ్బిమేతమేయకుండా ఎక్కడ పడితే అక్కడే నిలబడి నీరసంగా ఉండడంతో యజమాని వైద్యం నిమిత్తం ప్రాంతీయ పశు వైద్యశాలకు నేడు తీసికొని వచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్ డా పి.పెంటయ్య ఆవుని పరీక్షించి కడుపులో భారీమొత్తంలో ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయని ,ఆవు కుడా 5 మాసాల గర్భంతో ఉన్నదని,అత్యవసరంగ శస్త్ర చికిత్స అవసరమని లేని పక్షంలో ఆవు ప్రాణాలకి ప్రమాదం అని తెలపడంతో, సూడి ఆవు ఆపరేషన్ ద్వారా పొట్ట కోస్తే బ్రతుకుతుందా లేదా అందులోను సూడిది కాబట్టి దూడకి ప్రమాదమేమో అని మీమాంసలో యజమాని తటపటాయించి చివరకు ఆవు పరిస్థితి చూసి శస్త్ర చికిత్సకి సిద్దమయారు. మద్యాహ్నం పన్నెండు గంటలకు మొదలైన ఆపరేషన్ సాయంత్రం నాలుగు గంటలకు గానీ పూర్తీ కాలేదు. పొట్ట కోసి అర్రలపోట్ట తెరిచిన తరువాత అసలు సమస్య ఎదురైంది. కొన్ని సంవత్సరాలుగా ఆవు తింటూ ఉన్న ప్లాస్టిక్ కవర్లు, వైర్లు, కేబుల్ వైర్లు, తాళ్ళు , ఇంకా రకరకాల తీగలు , రోజు వారీ పొట్ట కదలికల్లో భాగంగా లోపల మెలికలు తిరిగి తిరిగి , బాల్స్ లాగ పెనవేసుకుపోయి బైటకు తీయడానికి అస్సలు వీలు కాక తిరిగి రకరకాల శస్త్ర చికిత్సలతో లోపల చుట్టుకుపొయున భాగాలను కట్ చేస్తూ తాళ్ళకి బిగించి మానవ శక్తితో బైటకు లాగడం జరిగింది. అలా 9౦ కిలోల పైన పేరుకు పోయిన ప్లాస్టిక్ మొత్తం తొలగించడానికి నాలుగు గంటల సమయం పట్టింది. ప్లాస్టిక్ తో పాటు కేబుల్ వైర్లు, మామిడి టెంకలు, ఇనుప తీగలు , ప్లాస్టిక్ తాళ్ళు , జాలీలు ,గుడ్డ పేలికలు ఇలా రక రకాల వస్తువులు మరో 5 కిలోల వరకు బైటపడ్డాయి 9౦ కిలోల మొత్తంలో ఆవు పొట్ట ఖాళీ కావడం తో ఆవు షాక్ నకు గురి కాకుండా కభేళా నుండి శుద్దమైన మరో పశువు పొట్ట కసరు తెప్పించి పొట్టలో వేసి ఆపరేషన్ విజయవంతంగా ముగించడం జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య మాట్లాడుతూ ఆవులు పట్టణంలోని వీదుల్లో తిరిగే సమయములో ఇండ్ల వెంబడి వీదుల వెంబడి ఇబ్బడి ముబ్బడిగా పడేసిన ప్లాస్టిక్ కవర్లను, కాగితాలను, గుడ్డలను ఆకలితో ఉన్న ఆవులు తినేస్తుంటాయి . అలా తిన్న ప్లాస్టిక్ గుడ్డలు , ఇతరాలన్నీ పొట్టలో కరిగే అవకాశం లేదు. ఇలా పొట్టలో అరగకుండా క్రమంగా పేరుకు పోయే ప్లాస్టిక్ అంతా పశువు నెమరు వేసే సమయములో పొట్ట కదలికలతో పాటు కవర్లు తీగలు చుట్టుకొని గుండ్రంగా తిరుగుతూ పెద్ద బాల్స్ లాగా తయారై కడుపులో ఖాళీ ఉన్నంతవరకు ఇలా పేరుకుపోతునే ఉంటాయి. సంవత్సరాలు గడిచినకొద్దీ లేదా లోపల కవర్ల మొత్తం పెరిగి పొట్టలో కదలికలికలకు అవకాశం లేక గడ్డి కూడా తినలేక పొట్టలో గ్యాస్ పేరుకుపోయి విశాప్రభావంతో నొప్పితో విలవిలలాడుతూ అప్పుడు ప్లాస్టిక్ తిన్న లక్షణాలు కనిపిస్తుంటాయి. అంత వరకు ఎలాంటి లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు అందువల్లనే చాలా మంది యజమానులు ఆవులు కింద పడిపోనంతవరకు ఈ ప్రమాదాన్ని గుర్తించలేరు. అందువల్లనే ఆవులు పరిస్థితి విషమించి ప్రనాపాయస్థితిలోకి చేరిన తరువాత పశువుల్ని గుర్తించి ఏమీ చేయలేక విలువైన పశువుల్ని పోగొట్టుకుంటున్నారు. పట్టణంలో ఉన్న ఆవులన్నింటికీ ఈ ప్రమాదం పొంచి ఉంది. ఆవుల యజమానులు ముందుకు వచ్చి తమ ఆవుల్ని వైద్యశాలకు తీసుకొని వచ్చినట్లయితే పట్టణంలోని అన్ని ఆవులకు శస్త్రచికిత్స చేసి వాటి కడుపులో ప్లాస్టిక్ తొలగిస్తామని, అలాగే వీది పశువులను ఎవరైనా స్వచ్చంద సంస్థలు, లేదా జంతు ప్రేమికులు ముందుకు వచ్చిన యెడల అవులన్నింటికీ అన్నింటికీ శస్త్ర చికిత్స నిర్వహించి వాటి ప్రాణాలను కాపాడతామని చెప్పారు. శశ్త్రచికిత్సలో కాపుగల్లు పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు డా సురేంద్ర , కట్టకోమ్ముగుడెం పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు డా. బి. శ్రీనివాస్ , సిబ్బంది, చంద్రకళ, సాగర్, అఖిల్ , నజీర్ తదితరులు పాల్గొనారు.

ఇవి కూడా చదవండి

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :

70,000/- లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడాల శ్రీధర్ సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ (జనరల్) సంగీన ఫణిరాజ్