జయకేతనం న్యూస్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో మొక్కలు పంపిణీ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి పాల్గొన్నారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇంటికొక మొక్కని నాటి భవిష్యత్తు తరాలకి నీడనందిస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని, దీనిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని హుజూర్ నగర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి కోరారు.ఇట్టి కార్యక్రమంలో మూడో వార్డు ఆఫీసర్ అశోక్,ఆర్ పి మంజుల, మున్సిపాలిటీ ఉద్యోగులు విజయ్,జవాన్ వెంకటేశ్వర్లు వార్డు ప్రజలు మహిళలు పాల్గొన్నారు..









